అమ్మో..చీరల యాపారం ఆపు తల్లి...పైపైన చూసి మనిషిని అంచనా వేయొద్దు
on Mar 19, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా అమర్ దీప్ వచ్చాడు. అంటే లాస్ట్ వీక్ ఎలిమినేట్ ఐపోయిన బ్రహ్మముడి మానస్ ప్లేస్ లో అమర్ దీప్ వచ్చాడు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ తర్వాత ఓంకార్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది అని చెప్పాడు. దాంతో దీపికా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన మెంటార్ అమరదీప్ కంటెస్టెంట్ అనుష్కను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. రీజన్ ఏంటి అని అడిగిన అమర్ దీప్ కి దీపికా చీరాల గురించి చెప్పుకొచ్చింది. "నేను ఒక చీరాల షాప్ కి వెళ్ళా. అక్కడ ఒక చీర బాగుంది అని తీసి పెట్టుకున్నా. ఇంకో చీర కూడా నచ్చిందని తీసి పెట్టుకున్నా..
అలా కొన్ని చీరల్ని తీసి పక్కన పెట్టుకున్నా. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు నాలుగు చీరలే పట్టుకుని వెళ్ళాలి అన్నప్పుడు..ఎంత నచ్చిన చీర ఐనా సరే వదులుకోవాలి" అని చీరల లాజిక్ చెప్పింది దీపికా. దాంతో అమర్ కి కోపం వచ్చేసింది. "ఇదేం నామినేషన్ అయ్యా..ఈమె చీర యాపారం చెప్తోంది" అంటూ ముఖాన్ని అష్టవంకర్లుగా పెట్టి మరీ చెప్పాడు. వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కె తనని ఎలిమినేట్ చేశారన్న బాధతో కంటెస్టెంట్ అనుష్క కన్నీళ్లు పెట్టుకుంది పాపం. దాంతో అమర్ మళ్ళీ "అది కాదు ఎందుకు ఎలిమినేట్ చేశారో రీజన్ కావాలి" అని అడిగాడు. దాంతో దీపికా మళ్ళీ డైలాగ్ వేసింది. "మై గాడ్..ఒక ఆడపిల్ల కన్నీళ్లకు నేను రీజన్ ఐపోయాను. ఇక తన కంటెస్టెంట్ కన్నీళ్లను చూసి తట్టుకోలేక "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అంటూ ఇంగ్లీష్ కోట్ ఒకటి చెప్పాడు. మరి ఈ వారం అసలు ఎం జరుగుతుంది. ఇలా వచ్చిన అమర్ అలా వెళ్ళిపోతాడా లేదంటే సేవ్ అయ్యి షోలో కంటిన్యూ అవుతాడా చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
